రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉంటూ జైలు జీవితం గడుపుతున్న కన్నడ నటుడు దర్శన్, పవిత్ర గౌడలకి బెంగళూరు హైకోర్టు బెయిల్ మంజారు చేసింది. అలాగే ఇదే కేసులో నిందితులుగా ఉంటున్న నాగరాజు, అను కుమార్, లక్ష్మణ్, జగదీష్ అలియాస్ జగ్గా, ఆర్ ప్రదూష్ రావు తదితరులకు బెయిల్ మంజూరైంది. ఈ కేసు విచారణపై జస్టిస్ విశ్వజిత్ శెట్టి మాట్లాడుతూ పిటీషిన్ దారులు దాఖలు చేసిన పిటీషన్స్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కండీషన్స్ తో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పవిత్ర గౌడ దాదాపుగా 7 నెలలపాటూ జైలు జీవితం గడిపింది.
అయితే అక్టోబరు 14న ట్రయల్ కోర్టు తనకు, పవిత్ర గౌడతోపాటు మరికొందరు నిందితులకు బెయిల్ నిరాకరించడంతో దర్శన్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇందులో నిందితులకి వ్యతిరేకంగా సాక్షాలు ఉండటం, అలాగే ప్రాథమిక సాక్ష్యాల విచారణ అవసరమని భావిస్తూ బెయిల్ పిటీషన్ ని కొట్టివేసింది. కానీ దర్శన్ ఆరోగ్య పరిస్థితులని దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 30న హైకోర్టు అతనికి 6 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ALSO READ : అల్లు అర్జున్ అరెస్టు హీరోలకు గుణపాఠమా..
చిత్రదుర్గలోని ఓ మెడికల్ షాపులో పనిచేస్తున్న రేణుకాస్వామిని జూన్ 8న బెంగళూరు నగరంలోని ఆర్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్టనగెరె వద్ద షెడ్‌లో కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మరుసటి రోజు ఈ నేరం వెలుగులోకి వచ్చింది. అయితే ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ సెక్యూరిటీ గార్డు రేణుకాస్వామి మృతదేహాన్ని గుర్తించాడు. నిందితుడు మృతుడిని పట్టనగెరెలోని షెడ్డులో ఉంచి చిత్రహింసలకు గురి చేసి హత్య చేసి మృతదేహాన్ని నీటి కాలువలో పారవేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.