దూరం అవుతున్నాడని.. బాయ్ ఫ్రెండ్ పై యువతి కాల్పులు

దూరం అవుతున్నాడని.. బాయ్ ఫ్రెండ్ పై యువతి కాల్పులు

ఇద్దరు యంగ్. వయసు 22 ఏళ్లు. ఒకర్నొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. నాలుగేళ్లుగా చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఆమెకు ఉద్యోగం రావడంతో మరో ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఇద్దరు కలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో యువకుడు తనను దూరం పెడుతున్నాడని భావించిన యువతి.. అతనిపై కోపం పెంచుకున్నది. ఒకసారి కలుద్దాం రావాలంటూ బాయ్ ఫ్రెండ్ ను కోరింది. అతడు రావడంతో తుపాకి తీసి కాల్పులు జరిపింది. అయితే బుల్లెట్‌ గురితప్పడంతో అతను గాయాలతో బయటపడ్డాడు. పశ్చిమబెంగాల్‌లోని పూర్వ బర్ధమాన్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

పూర్వ బర్ధమాన్‌ జిల్లాలోని కేషియా గ్రామానికి చెందిన ఓ జంట గత నాలుగేండ్లుగా కలిసి తిరుగుతున్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఆమెకు ఉద్యోగం వచ్చింది. దీంతో జార్ఖండ్‌లో ఉంటున్నది. ఈనెల 14న (బుధవారం) జార్ఖండ్‌ నుంచి వచ్చిన ఆమె.. కేషియాలో ఉన్న ఓ సర్కస్‌ గ్రౌండ్‌లో కలుద్దామని అతనికి చెప్పింది. దీంతో బుధవారం రాత్రి ఇద్దరు కలుసుకున్నారు. చూడగానే అతడిని కౌగిలించుకున్న ఆమె.. ఆ యువకుడిపై ముద్దుల వర్షం కురిపించింది. అనంతరం ఇద్దరూ కలిసి సిగరెట్‌ తాగారు. అంతలోనే వెంట తెచ్చుకున్న తుపాకీతో అతనిపై కాల్పులు జరిపింది. అయితే అది గురితప్పడంతో బుల్లెట్లు యువకుని పొట్టలోకి దూసెకెళ్లాయి. అతడు కేకలు వేయడంతో ఆ యువతి అక్కడి నుంచి ఉడాయించింది. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని దవాఖానకు తరలించారు. అయితే ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్నదనే కారణంతో తనపై కాల్పులు జరిపిందని యువకుడు పోలీసులు ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం రాత్రి ఆమెను అదుపులోకి తీసుకుని, బుల్లెట్లు, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవికూడా చదవండి:

ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో బుక్ ఫెయిర్

దీపిక కోసం ప్రభాస్ భారీ లంచ్‌‌‌‌‌‌‌‌