కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలిస్తే బెంగాల్ మరో కశ్మీర్‌లా తయారవుతుందని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై పోటీకి సిద్ధమవుతున్న సువేందు.. ఆమెపై విమర్శలకు దిగారు. దీదీని ఓడించి తీరుతానని స్పష్టం చేశారు. జన్ సంఘ్ ఫౌండర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లేకపోయుంటే మన దేశం బంగ్లాదేశ్‌లా ఇస్లామిక్ కంట్రీగా మారిపోయుండేదన్నారు.
