డబుల్​ ఇండ్లు ఇవ్వాలని ధర్నా

కల్వకుర్తి, వెలుగు : పట్టణంలో లక్కీ డిప్  ద్వారా ఎంపిక చేసిన 240 మంది లబ్ధిదారులకు వెంటనే డబుల్​ ఇండ్లు అప్పగించాలని లబ్ధిదారుల సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్  చేశారు. సోమవారం లబ్ధిదారులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

గత ప్రభుత్వం గత ఏడాది మేలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు ఇవ్వకుండా కాలయాపన చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డబుల్  బెడ్రూమ్  ఇండ్లు ఇవ్వాలని కోరారు. ఏపీ మల్లయ్య, చింత ఆంజనేయులు, బాలస్వామి, చిలుక బాల్​రెడ్డి, కిశోర్, జగన్, బాలకృష్ణ పాల్గొన్నారు.