Ben Stokes: స్టోక్స్ ఇంటిలో దొంగలు.. నగలు, విలువైన వస్తువులు చోరీ

ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంటిలో దొంగతనం జరిగింది. అతను లేని సమయంలో తన ఇంటిలో కుటుంబం ఉండగా ముసుగు దొంగలు చోరీకి గురయ్యారని స్టోక్స్ వెల్లడించాడు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు ఈ ఇంగ్లాండ్ కెప్టెన్ పాకిస్థాన్‌లో ఉండగా ఈ సంఘటన జరిగినట్టు తెలిపాడు. సోషల్ మీడియా వేదికగా పోలీసులను సహాయం కోసం విజ్ఞప్తి చేశాడు. 

"అక్టోబరు 17వ తేదీ గురువారం సాయంత్రం కొందరు దుండగులు మాస్క్‌లు ధరించి.. కాజిల్ ఈడెన్ ప్రాంతంలోని నా ఇంటిలోకి ప్రవేశించారు. వారు ముసుగులు ధరించి నగలతో పాటు ఇతర విలువైన వస్తువులు తీసుకొని పారిపోయారు. వాటిలో చాలా వస్తువులకు మా కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. 

Also Read :  మరికొన్ని గంటల్లో ప్లేయర్స్ రిటెన్షన్ లిస్ట్

నా భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ చోరీ జరిగింది. నా కుటుంబంలో ఎవరికీ ఎటువంటి శారీరక హాని జరగనందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. దొంగిలించబడిన కొన్ని వస్తువుల చిత్రాలను స్టోక్స్ షేర్ చేశాడు. దొంగిలించబడిన వస్తువులలో ఆభరణాలు డిజైనర్ బ్యాగ్‌తో సహా OBE మెడల్ కూడా ఉందని తెలిపాడు. 2019లో ఇంగ్లాండ్ క్రికెట్ కు అతను చేసిన సేవలకు అతనికి ఈ మెడల్ లభించింది" అని చెప్పుకొచ్చాడు.

స్టోక్స్ కెప్టెన్సీలో పాకిస్థాన్ ఇటీవలే టెస్ట్ సిరీస్ ను 1-2 తేడాతో కోల్పోయింది. గాయంతో నాలుగు టెస్టుల తర్వాత పాకిస్థాన్ తో జరిగిన రెండో టెస్టు ఆడాడు. స్టోక్స్ ఈ సిరీస్ లో కెప్టెన్సీతో పాటు ఆటగాడిగా విఫలమయ్యాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ నవంబర్‌లో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్‌కు వెళ్లనుంది.