పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో..బెన్‌‌‌‌‌‌‌‌ డకెట్‌‌‌‌‌‌‌‌ సెంచరీ

ముల్తాన్‌‌‌‌‌‌‌‌ : పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ బెన్‌‌‌‌‌‌‌‌ డకెట్‌‌‌‌‌‌‌‌ (129 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 16 ఫోర్లతో 114) సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 53 ఓవర్లలో 239/6 స్కోరు చేసింది. జెమీ స్మిత్‌‌‌‌‌‌‌‌ (12 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), బ్రైడన్‌‌‌‌‌‌‌‌ కార్సీ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జో రూట్‌‌‌‌‌‌‌‌ (34), ఒలీ పోప్‌‌‌‌‌‌‌‌ (29), జాక్‌‌‌‌‌‌‌‌ క్రాలీ (27) మోస్తరుగా ఆడారు.

హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌ (9), బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (1) నిరాశపర్చారు. సాజిద్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ 4, నోమన్‌‌‌‌‌‌‌‌ అలీ రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ఇంకా 127 రన్స్‌‌‌‌‌‌‌‌ వెనకబడి ఉంది. అంతకుముందు 259/5 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన పాక్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 123.3 ఓవర్లలో 366 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. మహ్మద్‌‌‌‌‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌‌‌‌‌ (41), సల్మాన్‌‌‌‌‌‌‌‌ ఆగా (31), అమెర్‌‌‌‌‌‌‌‌ జమాల్‌‌‌‌‌‌‌‌ (37), నోమన్‌‌‌‌‌‌‌‌ అలీ (32) రాణించారు. జాక్‌‌‌‌‌‌‌‌ లీచ్‌‌‌‌‌‌‌‌ 4, కార్సీ 3, పాట్స్‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు పడగొట్టారు.