ముగ్గురు కొడుకులు.. రెండు దేశాలు: జింబాబ్వే తరపున బెన్ కుర్రాన్‌ అరంగ్రేటం

ఓ తండ్రికి ముగ్గురు కుమారులైతే.. ఆ ముగ్గురూ ప్రయోజకులు అవుతారా..! అంటే సందేహించాల్సిందే. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు మిగిలిన ఇద్దరి పేర్లు చెడగొట్టేలానే ఉంటాడు. ఊరిలో ఉన్న గొడవలన్నీ ఇంటి మీదకు తెస్తుంటాడు. ఇలాంటి ఉదాహరణలు మీ ఊర్లలోనూ బోలెడు చూసుంటారు. కానీ, మాజీ క్రికెటర్ కెవిన్ కుర్రాన్‌ కుమారులు అలా కాదు.. తండ్రికి తగ్గ తనయులు అనిపించారు. 

కెవిన్ కుర్రాన్‌కు ముగ్గురు కుమారులు కాగా.. వారిలో ఇద్దరు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు అర్హత వహిస్తుంటే, మరొకరు త్వరలోనే జింబాబ్వే తరపున వన్డేల్లో అరంగ్రేటం చేయనున్నాడు. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు బెన్ కుర్రాన్ పిలుపు అందుకున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరైన బెన్ జింబాబ్వే దేశవాళీ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దాంతో, సెలక్టర్లు అతనికి వన్డే జట్టులో చోటు కల్పించారు.

ALSO READ | Temba Bavuma: కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అద్భుతం.. టెస్ట్ క్రికెట్‌లో దూసుకెళ్తున్న బవుమా

బెన్ కుర్రాన్ ఇద్దరు సోదరులు మరెవరో కాదు.. సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్. ఈ ఇద్దరు భారత అభిమానులకు సుపరిచితమే. ఐపీఎల్‌లో ఆడినవారే. సామ్ కుర్రాన్  2023 ఐపీఎల్ సీజన్ లో రూ. 18.50 కోట్ల ధర పలికి రికార్డుల్లోకెక్కాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ben Curran (@curran_jb)

ఎవరీ కెవిన్ కుర్రాన్..?

ఆల్ రౌండర్ అయిన  కెవిన్ కుర్రాన్ 1980లలో జింబాబ్వే జట్టు తరఫున అంతర్జాతీయ అరంగ్రేటం చేశారు. మొత్తంగా 11 వన్డేలు మాత్రమే ఆడారు. ఆ తర్వాత జట్టుకు హెడ్‌గా పనిచేశారు. కెవిన్ కుర్రాన్ 53 సంవత్సరాల వయస్సులో మరణించారు. కొడుకుల ఎదుగుదలను ఆ తండ్రి కళ్లారా చూడలేకపోయారే తప్ప.. కెవిన్ పేరును మాత్రం అతని కుమారులు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ben Curran (@curran_jb)