అతనికి రెండు కాళ్లు పని చేయవు. దీంతో భార్య సహాయంతో భిక్షాటన చేసేవాడు. మూడు చక్రాల వాహనంపై కూర్చొంటే.. భార్య తోలుతూ ఉండేది. పలు ప్రాంతాల్లో భిక్షాటన చేసిన తర్వాత.. ఇంటికి వచ్చేవారు. గుళ్లు, బస్టాండులు, ఇతరత్ర ప్రాంతాల్లో వీరు యాచించే వారు. అయితే.. తోలుతున్న సమయంలో భార్య పడుతున్న కష్టాన్ని చూసి బాధ పడేవాడు. ఎలాగైనా భార్య కష్టాన్ని తీర్చాలని అనుకున్నాడు. ఓ రోజు మోపైడ్ కొని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
చింధ్వారా జిల్లా అమరవర గ్రామంలో సంతోష్ సాహు దంపతులు నివాసం ఉండేవారు. సాహుకు రెండు కాళ్లు పనిచేయక పోవడంతో భార్య సహాయంతో భిక్షాటన చేసేవారు. త్రిచక్ర వాహనంలో తిరుగుతూ.. సాహూ యాచించేవాడు. వీరు యాచక వృత్తితోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చే వారు. రోజు వాహనాన్ని తోలుతుండడంతో భార్య అనారోగ్యానికి గురయ్యేది. ఆమె పడుతున్న కష్టాన్ని అతను చూడలేకపోయాడు. పైసా పైసా జమ చేశాడు సాహు. నాలుగు సంవత్సరాలుగా జమ చేసిన మొత్తం రూ. 90 వేలు అయిన తర్వాత.. మోపైడ్‌ను కొనుగోలు చేశాడు సాహు. ఇప్పుడు మోపైడ్‌పై భిక్షాటన చేస్తున్నారు. సాహు దంపతులు రోజుకు రూ. 300 నుంచి రూ. 400 వరకు సంపాదిస్తారని తెలుస్తోంది.
#WATCH A beggar, Santosh Kumar Sahu buys a moped motorcycle worth Rs 90,000 for his wife Munni in Chhindwara, MP
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 24, 2022
Earlier, we had a tricycle. After my wife complained of backache, I got this vehicle for Rs 90,000. We can now go to Seoni, Itarsi, Bhopal, Indore, he says. pic.twitter.com/a72vKheSAB
మరిన్ని వార్తల కోసం : -
ముంబయి బాలిక... ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ
NEC కార్పొరేషన్ ఛైర్మన్‌తో మోడీ భేటీ
