ఓటర్లపై తేనెటీగల దాడి

అమ్రాబాద్, వెలుగు : నాగర్‌కర్నూల్‌‌‌‌ జిల్లా అమ్రాబాద్‌‌‌‌ మండలం వటవర్లపల్లి గ్రామంలోని పోలింగ్‌‌‌‌ బూత్‌‌‌‌లో ఓటు వేసేందుకు వస్తున్న వారిపై తేనెటీగల దాడి చేశాయి. దీంతో ఓటర్లంతా పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో గాయపడిన 25 మందికి స్థానిక పీహెచ్‌‌‌‌సీలో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేశారు. తీవ్రంగా గాయపడ్డ సింధు, మౌనిక, గణేశ్, తిరుపతిని అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.