బీర్ బాటిల్ తో కొట్టి.. వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య

వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బీర్ బాటిల్ తో యువకుడిపై దాడి చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోముల్ పోలీసు స్టేషన్  పరిధిలో ఎన్కెపల్లి గేటు సమీపంలోని  ఓ వెంచర్ లో స్థానికులకు యువకుడి డెడ్ బాడీ  కనపించింది. వెంటనే డెడ్ బాడీపై  పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు మన్నేగూడకు చెందిన సంజీవ్ కుమార్ గా గుర్తించారు.

 ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్యపై కేసు నమోదు చేసుకున్నామని దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు.