ఈ నెల 5 తర్వాత వ్యాక్సినేషన్ కు రెడీగా ఉండండి

ఈ నెల 5 తర్వాత వ్యాక్సినేషన్ కు రెడీగా ఉండండి
రాష్ట్రానికి కేంద్రం సూచన తొలిదశలో 5 లక్షల మందికి పంపిణీ అన్ని సర్కారీ హాస్పిటళ్లలో ఇచ్చేలా ఏర్పాట్లు మనకు కోవాగ్జిన్ ఇవ్వాలని కోరనున్న హెల్త్ డిపార్టుమెంట్ హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సినేషన్‌‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల ఐదో తేదీ తర్వాత ఎప్పుడైనా వ్యాక్సిన్ పంపిణీకి రెడీ ఉండాలని రాష్ట్రానికి కేంద్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​ సూచించినట్టు తెలిసింది. రాష్ట్రంలో వారం, పది రోజుల్లోపలే పూర్తి స్థాయి వ్యాక్సినేషన్  మొదలయ్యే చాన్స్​ ఉందని అధికారులు చెప్తున్నారు. తొలిదశలో మన దగ్గర ఐదు లక్షల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్టు మంత్రి ఈటల రాజేందర్  వెల్లడించారు. ఇందులో డాక్టర్లు, హెల్త్ స్టాఫ్, పోలీసులు, శానిటేషన్‌‌ వర్కర్లు ఉంటారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖాన్లతో పాటు, హైదరాబాద్‌‌లోని కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యాక్సినేషన్ కోసం పది వేల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కో సెంటర్‌‌‌‌లో వంద మందికి వ్యాక్సిన్ ఇస్తారు. దీనిపై సోమవారం అన్ని జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లతో స్టేట్ హెల్త్ ఆఫీసర్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే కొవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఓకే చెప్పిన ఎక్స్‌‌పర్ట్స్‌ కమిటీ .. శనివారం భారత్ బయోటెక్‌‌‌‌ ఉత్పత్తి చేసిన కొవ్యాగ్జిన్‌‌‌‌కు కూడా ఆమోద ముద్ర వేసింది. కొవిషీల్డ్​ పుణెలో తయారవుతుండగా.. కొవ్యాగ్జిన్ హైదరాబాద్‌‌‌‌లోనే తయారవుతోంది. రెండు కంపెనీలు ఇప్పటికే పెద్ద సంఖ్యలోటీకా డోసులను రెడీ చేసి, కోల్డ్ స్టోరేజీల్లో పెట్టాయి. అయితే మన రాష్ట్రంలో ఇంకా కొవ్యాగ్జిన్ ట్రయల్స్‌‌‌‌ జరుగుతున్నాయి. దీని మంచి, చెడులపై నిమ్స్‌‌‌‌ డాక్టర్లకు పూర్తి అవగాహన ఉంది. దీంతో మన రాష్ట్రానికి కొవ్యాగ్జిన్  ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని స్టేట్‌‌‌‌ హెల్త్  డిపార్ట్‌‌‌‌మెంట్  భావిస్తోంది. కొవ్యాగ్జిన్ తో ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్  సమస్య ఉండదని అధికారులు చెప్తున్నారు. అయితే ఏ వ్యాక్సిన్ ఇవ్వాలన్న దానిపై కేంద్రమే నిర్ణయం తీసుకోనుంది. కరోనా లాక్‌డౌన్‌ టైమ్​ కుటుంబాలకు మేలే చేసింది హైదరాబాద్‌లో చెట్టు కొట్టేసినందుకు రూ. 10 వేల ఫైన్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్‌‌ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్