న్యూఢిల్లీ: క్రికెట్ ఫ్యాన్స్‌ను తిరిగి స్టేడియాల్లోకి తీసుకొచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్, పుణెలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌ను అనుమతించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను బోర్డు సిద్ధం చేస్తోంది. తొలి రెండు టెస్ట్‌లకు 50 శాతం ఫ్యాన్స్‌ను అనుమతించాలని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ)ను ముందు బీసీసీఐ చేసిన ప్రతిపాదనకు మోక్షం లభించలేదు. అయితే ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తుండటంతో మొతెరా, పుణెలో ఫ్యాన్స్‌ను స్టేడియాలకు రప్పించాలని బోర్డు భావిస్తోంది. ‘మొతెరాలో జరిగే రెండు టెస్ట్‌లు, 5 టీ20, పుణెలో జరిగే మూడు వన్డేలకు ఫ్యాన్స్‌ను అనుమతించాలని బీసీసీఐ ప్లాన్స్ చేస్తోంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన క్రికెట్ అసోసియేషన్లతో బోర్డు చర్చలు జరుపుతోంది. హెల్త్ అథారిటీస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఫ్యాన్స్ మధ్యనే మ్యాచ్‌లు జరుగుతాయి. పునరుద్ధరించిన మొతెరాలో ఫ్యాన్స్ ఉంటేనే మజా వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే ఎంత కెపాసిటీని అనుమతించాలనే దానిని ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం మొతెరా సీటింగ్ కెపాసిటీ లక్ష. ఇందులో 50 శాతం లేదంటే 25, 30 వేల మందికి అనుమతి లభించే చాన్స్ ఉంది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
బబుల్‌లోకి చీఫ్ సెలెక్టర్
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌ల కోసం చెన్నైకి చేరుకున్న ఇండియా.. బయో బబుల్‌లోకి వెళ్లింది. ఆరు రోజుల మాండేటరీ క్వారంటైన్‌లో భాగంగా హోటల్ రూమ్‌లకే పరిమితమైంది. అయితే టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కూడా గురువారం బబుల్‌లోకి ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం ఇండియా టీమ్ మేనేజ్‌మెంట్ వర్చువల్ మీటింగ్స్‌ను మాత్రమే కండక్ట్ చేస్తున్నది. దీంతో కెప్టెన్ కోహ్లీ, టీమ్ మేనేజ్‌మెంట్‌తో కలిసి శర్మ కూడా రెండు మీటింగ్‌ల్లో పాల్గొనే అవకాశం ఉంది.
