ఇవాళ(డిసెంబర్ 20) బీసీసీఐ అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ : బీసీసీఐ సెక్రటరీ, ట్రెజరర్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ల భర్తీ కోసం ఎలక్షన్స్‌‌‌‌ను నిర్వహించేందుకు బోర్డు శుక్రవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌‌‌ అచల్‌‌‌‌ కుమార్‌‌‌‌ జ్యోతిని ఎలక్టోరల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌గా నియమించనుంది. ఇన్నాళ్లూ బీసీసీఐ సెక్రటరీగా పని చేసిన జై షా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌‌‌‌గా వెళ్లగా, ఆశీష్‌‌‌‌ షెలార్‌‌‌‌ (ట్రెజరర్‌‌‌‌) మహారాష్ట్ర గవర్నమెంట్‌‌‌‌లో క్యాబినెట్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌గా పని చేస్తున్నారు.

బోర్డు రాజ్యాంగం ప్రకారం ఖాళీ అయిన ఈ రెండు పోస్ట్‌‌‌‌లను 45 రోజుల్లో నింపాలి. అదే టైమ్‌‌‌‌లో నాలుగు వారాల ముందు ఎలక్టోరల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ను నియమించాలి. ప్రస్తుతం అస్సాంకు చెందిన దేవజిత్‌‌‌‌ సైకియా బోర్డు తాత్కాలిక సెక్రటరీ, ట్రెజరర్‌‌‌‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మరోవైపు ఈ ఏడాది  బీసీసీఐ బ్యాంక్‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌ భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే రూ. 4200 కోట్ల పెరుగుదల కనిపిస్తోంది.

మొత్తం ఆదాయం రూ. 20,668 కోట్లుగా ఉంది. ‘బీసీసీఐ నగదు, బ్యాంక్‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌ 2023 ఫైనాన్షియల్‌‌‌‌ ఏడాదిలో రూ. 16,493 కోట్లుగా ఉంది. అదే 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 20,686 కోట్లకు పెరిగింది. 2023–24 ఏడాదిలో రూ. 7476 కోట్లు వస్తుందని అంచనా వేయగా, వాస్తవిక ఆదాయం రూ. 8995 కోట్లు వచ్చింది.