Bangladesh Cricket: క్రికెటర్‌ని చెంపదెబ్బ కొట్టిన బంగ్లాదేశ్ కోచ్.. సస్పెన్షన్ వేటు

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ చండికా హతురుసింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్‌ సమయంలో ఒక ఆటగాడిని చెంపదెబ్బ కొట్టిన ఆరోపణల నేపథ్యంలో బంగ్లా క్రికెట్ బోర్డు(BCB) ఈ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు అతనిపై సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్ అనంతరం అతని కాంట్రాక్ట్ రద్దు చేయబడుతుందని బీసీబీ ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ వెల్లడించారు. 

శ్రీలంక మాజీ క్రికెటరైన హతురుసింగ్‌పై బంగ్లా క్రికెట్ బోర్డు పలు నిందలు మోపింది. జాతీయ జట్టు ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం అతనికి అలవాటైతే.. కీలక సిరీస్‌ల ముందు డుమ్మా కొట్టి స్వదేశానికి వెళ్లడం అతనికి పరిపాటిగా మారిందని బంగ్లా బోర్డు ఆరోపించింది. హతురుసింగ్‌ స్థానంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం ఫిల్ సిమ్మన్స్ తాత్కాలిక కోచ్‌గా నియమించింది. సిమన్స్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వరకు తాత్కాలిక హోదాలో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ALSO READ | IND vs NZ 2024: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. భారత్ తుది జట్టు ఇదే

హతురుసింగ్ హయాంలో బంగ్లాదేశ్ జట్టు.. పాకిస్తాన్‌ గడ్డపై సంచలన విజయం సాధించింది. సొంతగడ్డపై ఆతిథ్య జట్టును ఓడించడమే కాకుండా.. సిరీస్ తన ఖాతాలో వేసుకుంది.