IND vs BAN: వారం రోజుల్లో భారత్‌తో టెస్ట్ సిరీస్.. బంగ్లా క్రికెట్ డైరెక్టర్ రాజీనామా

మరో వారం రోజుల్లో భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా.. బంగ్లా క్రికెట్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ డైరెక్టర్ ఖలీద్ మహమూద్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. 

గాజీ అష్రఫ్ హుస్సేన్‌ను ఓడించి 2013లో తొలిసారిగా డైరెక్టర్‌గా ఎన్నికైన మహమూద్, వరుసగా మూడు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగారు. మహమూద్ హయాంలో యువ బంగ్లా జట్టు 2020లో భారత్‌ను ఓడించి U19 ప్రపంచ కప్‌ గెలుచుకుంది. ఈ మాజీ క్రికెటర్ డైరెక్టర్ పాత్రతో పాటు, BCB గేమ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా పనిచేశారు. జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్‌గానూ ఉన్నారు.

బంగ్లా క్రికెట్ డైరెక్టర్ దారిలో మరికొందరు నడవనున్నట్లు తెలుస్తోంది. బోర్డు డైరెక్టర్లు షఫియుల్ ఆలం చౌదరి, నైమూర్ రెహమాన్‌ సహా మరికొందరు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

భారత్- బంగ్లాదేశ్ షెడ్యూల్

  • మొదటి టెస్ట్: సెప్టెంబర్ 19- సెప్టెంబర్ 23(చెన్నై)
  • రెండో టెస్ట్: సెప్టెంబర్ 27-  అక్టోబర్ 01(కాన్పూర్)
  • తొలి టీ20: అక్టోబర్ 06 (గ్వాలియర్)
  • రెండో టీ20: అక్టోబర్ 09 (ఢిల్లీ)
  • మూడో టీ20: అక్టోబర్ 12 (హైదరాబాద్)