నవంబర్ 29న బీసీ సంక్షేమ సంఘం సభ : జాజుల శ్రీనివాస్ గౌడ్

మంచిర్యాల, వెలుగు : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జిల్లా పర్యటన సందర్భంగా ఈ నెల 29న మంచిర్యాలలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలకంఠేశ్వర్ గౌడ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చార్వక హాల్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతో పాటు అన్ని బీసీ సంఘాల నాయకులు సభ సక్సెస్ చేసేందుకు కృషి చేయాలని కోరారు. నాయకులు కె.శ్రీనివాస్, రాంశెట్టి నరేందర్, ఆర్.కిరణ్, పి.చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.