వీసీల నియామకాల్లో బీసీలకు చోటు లేదు: జాజుల శ్రీనివాస్ గౌడ్

తెలంగాణలో  బీసీలకు అన్యాయం జరుగుతోందని..గత బీఆర్ఎస్ పాలనతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే తీరు కనిపి స్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య క్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు . కబ్జాకోరులపై పీడీ యాక్టులు పెట్టి వర్సిటీ భూములను పరిరక్షించాలన్నారు. కేయూ గెస్ట్ హౌస్ లో  మాట్లాడిన ఆయన 'పదవుల్లో బీసీలకు ప్రా ధాన్యం దక్కడం లేదు. యూనివర్సిటీ వీసీలని యామకాల్లో కూడా చోటు లేకుండాపోయిందన్నారు.

అధికారం కోసం బీసీల ఓట్లు అవసరం కానీ.. అధికారంలో భాగం చెయ్యరా..? అని ప్రశ్నించారు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ వైఖరి మారకపోతే ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని 10 వేల మందితో ముట్టడిస్తం. బీసీల వాటా బీసీలకు ఇవ్వకపోతే ప్రభుత్వ మెడలు వంచి అయినా తీసుకుంటం. విద్యార్థుల బలి దానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రభుత్వాలు యూనివర్శిటీలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఖాళీగా ఉన్న 70 శాతం ప్రొఫెసర్ల పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదు. విద్యార్థుల మెస్ బిల్లులు వంద శాతం ప్రభుత్వమే భరించాలి. వందల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురైతే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు' అని ప్రశ్నించారు.