సంక్రాంతిలోపు బీసీ లెక్కలు.. తెలంగాణలో బీసీలు 56 శాతం!

  • కులగణనతో తేలిందంటున్న ప్రభుత్వవర్గాలు
  • త్వరలో కేబినెట్​లో ఆమోదించే చాన్స్ 

హైదరాబాద్, వెలుగు:బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ తుది దశకు చేరుకున్నది. సంక్రాంతిలోపే ప్రభుత్వానికి రిపోర్ట్ అందించేందుకు కమిషన్ కసరత్తు చేస్తున్నది. కులగణన వివరాలు పూర్తి స్థాయిలో అందాయని కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. త్వరలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో సమావేశమై.. రిపోర్ట్ పూర్తి చేస్తామంటున్నాయి. కాగా, రాష్ట్రంలో 56 శాతం బీసీలు ఉన్నట్లు కులగణనలో తేలినట్లు సమాచారం. 

ఈ లెక్కలకు అనుగుణంగా ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అందజేయనున్నది. ఈ రిపోర్ట్ పై లీగల్ ఇబ్బందులు రాకుండా, కోర్టుల్లో పిటిషన్లు దాఖలు అయితే.. ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ తో పాటు సీనియర్ అడ్వకేట్లను సంప్రదించనున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును కేబినెట్ ​సమావేశంలో ఆమోదించే అవకాశాలున్నాయి. 

ALSO READ : 9న కొత్త ఎనర్జీ పాలసీ ప్రకటిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి

త్వరలో రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. సుప్రీంకోర్టు గైడ్​లైన్స్ ప్రకారం కులగణన చేయటంతో పాటు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని వర్గాల నుంచి వినతులు తీసుకొని ప్రభుత్వానికి గైడ్​లైన్స్ సూచించాలని సుప్రీంకోర్టు సూచించింది.