Big Bash League: ఐపీఎల్ తర్వాత అతి పెద్ద లీగ్.. బిగ్ బాష్ పోరుకు వేళాయె

టెస్ట్ మ్యాచ్‌లతో విసిగిపోయారా..! పొట్టి క్రికెట్ సమరం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారా..! ఇంకెందుకు ఆలస్యం. ఐపీఎల్ తరువాత క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తి చూపే బిగ్ బాష్ లీగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 13 సీజన్లు  పూర్తి చేసుకున్న బిగ్ బాష్ టోర్నీ 14వ సీజన్ ఆదివారం (డిసెంబర్ 15) నుండి షురూ కానుంది. ప్రారంభ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్, మెల్‌బోర్న్ స్టార్స్ తలపడనున్నాయి.

ఆస్ట్రేలియా వేదికగా ఈ టోర్నీకి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. మొత్తం ఎనిమిది జట్లు టైటిల్ వేటలో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ బ్రిస్బేన్ హీట్ మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టంటే.. పెర్త్ స్కార్చర్స్. ఇప్పటివరకూ ఐదు సార్లు ట్రోఫీ దక్కించుకుంది. ఆసీస్ స్టార్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆడం జంపా, స్టీవ్ స్మిత్ సహా విదేశీ స్టార్లు జేమ్స్ విన్స్, కోలిన్ మున్రో, ఫిన్ అలెన్, షాయ్ హోప్), ఫాబియన్ అలెన్, అకేల్ హోసేన్, ఉసామా మీర్ వంటి మరికొందరు అలరించనున్నారు.

ALSO READ | SMAT 2024: సూర్య గొప్ప మనసు.. రహానే సెంచరీ కోసం ఏం చేశాడంటే..?

బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొనే జట్లు:

  • అడిలైడ్ స్ట్రైకర్స్: మాట్ షార్ట్ (కెప్టెన్)
  • బ్రిస్బేన్ హీట్ (డిఫెండింగ్ ఛాంపియన్స్): ఉస్మాన్ ఖవాజా (కెప్టెన్)
  • హోబర్ట్ హరికేన్స్: నాథన్ ఎల్లిస్ (కెప్టెన్)
  • మెల్‌బోర్న్ రెనెగేడ్స్: విల్ సదర్లాండ్ (కెప్టెన్)
  • మెల్‌బోర్న్ స్టార్స్: మార్కస్ స్టోయినిస్ (కెప్టెన్)
  • పెర్త్ స్కార్చర్స్: అష్టన్ టర్నర్ (కెప్టెన్)
  • సిడ్నీ సిక్సర్స్: మోయిసెస్ హెన్రిక్స్ (కెప్టెన్)
  • సిడ్నీ థండర్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్)

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు:

బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లు మన దేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డిజిటల్‌గా అభిమానులు డిస్నీ+ హాట్‌స్టార్, ఫ్యాన్‌కోడ్ యాప్, ఆయా వెబ్‌సైట్‌లో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను ఆనందించవచ్చు.

బిగ్ బాష్ లీగ్ షెడ్యూల్:

డిసెంబర్ 15, 2024: పెర్త్ స్కార్చర్స్ vs మెల్‌బోర్న్ స్టార్స్  (ఆప్టస్ స్టేడియం)
డిసెంబర్ 16, 2024: సిడ్నీ సిక్సర్స్ vs మెల్‌బోర్న్ రెనెగేడ్స్ (SCG)
డిసెంబర్ 17, 2024: సిడ్నీ థండర్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ (మనుకా ఓవల్)
డిసెంబర్ 18, 2024: మెల్‌బోర్న్ స్టార్స్ vs బ్రిస్బేన్ హీట్ (MCG)
డిసెంబర్ 19, 2024: మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs హోబర్ట్ హరికేన్స్- GMHBA స్టేడియం
డిసెంబర్ 20, 2024: అడిలైడ్ స్ట్రైకర్స్ vs మెల్‌బోర్న్ స్టార్స్ (అడిలైడ్ ఓవల్)
డిసెంబర్ 21, 2024: హోబర్ట్ హరికేన్స్ vs పెర్త్ స్కార్చర్స్ (బ్లండ్‌స్టోన్ అరేనా)
డిసెంబర్ 21, 2024: సిడ్నీ థండర్ vs సిడ్నీ సిక్సర్స్ (ENGIE స్టేడియం)
డిసెంబర్ 22, 2024: బ్రిస్బేన్ హీట్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ (గబ్బా)
డిసెంబర్ 23, 2024: మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs పెర్త్ స్కార్చర్స్ (మార్వెల్ స్టేడియం)
డిసెంబర్ 26, 2024: సిడ్నీ సిక్సర్స్ vs మెల్‌బోర్న్ స్టార్స్ (SCG)
డిసెంబర్ 26, 2024: పెర్త్ స్కార్చర్స్ vs బ్రిస్బేన్ హీట్ (ఆప్టస్ స్టేడియం)
డిసెంబర్ 27, 2024: అడిలైడ్ స్ట్రైకర్స్ vs హోబర్ట్ హరికేన్స్  (అడిలైడ్ ఓవల్)
డిసెంబర్ 28, 2024: మెల్‌బోర్న్ స్టార్స్ vs సిడ్నీ థండర్  (మనుకా ఓవల్)
డిసెంబర్ 29, 2024: బ్రిస్బేన్ హీట్ vs సిడ్నీ సిక్సర్స్ (గబ్బా)
డిసెంబర్ 30, 2024: సిడ్నీ థండర్ vs మెల్‌బోర్న్ రెనెగేడ్స్  (ENGIE స్టేడియం)
డిసెంబర్ 31, 2024: అడిలైడ్ స్ట్రైకర్స్ vs పెర్త్ స్కార్చర్స్ (అడిలైడ్ ఓవల్)

జనవరి 6, 2025: బ్రిస్బేన్ హీట్ vs సిడ్నీ థండర్ (గబ్బా)
జనవరి 7, 2025: పెర్త్ స్కార్చర్స్ vs మెల్‌బోర్న్ రెనెగేడ్స్ (ఆప్టస్ స్టేడియం)
జనవరి 8, 2025: సిడ్నీ థండర్ vs హోబర్ట్ హరికేన్స్ (ENGIE స్టేడియం)
జనవరి 9, 2025: మెల్‌బోర్న్ స్టార్స్ vs సిడ్నీ సిక్సర్స్ (MCG)
జనవరి 10, 2025: హోబర్ట్ హరికేన్స్ vs సిడ్నీ థండర్ (బ్లండ్‌స్టోన్ అరేనా)
జనవరి 11, 2025: సిడ్నీ సిక్సర్స్ vs పెర్త్ స్కార్చర్స్ (SCG)
జనవరి 11, 2025: అడిలైడ్ స్ట్రైకర్స్ vs బ్రిస్బేన్ హీట్ (అడిలైడ్ ఓవల్)
జనవరి 12, 2025: మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs మెల్‌బోర్న్ స్టార్స్ (మార్వెల్ స్టేడియం)
జనవరి 13, 2025: సిడ్నీ థండర్ vs పెర్త్ స్కార్చర్స్ (ENGIE స్టేడియం)
జనవరి 14, 2025: హోబర్ట్ హరికేన్స్ vs మెల్‌బోర్న్ రెనెగేడ్స్ (బ్లండ్‌స్టోన్ అరేనా)
జనవరి 15, 2025: అడిలైడ్ స్ట్రైకర్స్ vs సిడ్నీ సిక్సర్స్ (అడిలైడ్ ఓవల్)
జనవరి 16, 2025: బ్రిస్బేన్ హీట్ vs హోబర్ట్ హరికేన్స్  (గబ్బా)
జనవరి 17, 2025: సిడ్నీ సిక్సర్స్ vs సిడ్నీ థండర్ (SCG)
జనవరి 18, 2025: మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs బ్రిస్బేన్ హీట్ (మార్వెల్ స్టేడియం)
జనవరి 18, 2025: పెర్త్ స్కార్చర్స్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ (ఆప్టస్ స్టేడియం)
జనవరి 19, 2025: మెల్‌బోర్న్ స్టార్స్ vs హోబర్ట్ హరికేన్స్ (MCG)
జనవరి 21, 2025: క్వాలిఫైయర్
జనవరి 22, 2025:  నాకౌట్
జనవరి 24, 2025:  ఛాలెంజర్
జనవరి 27, 2025: ఫైనల్స్