నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

నైరుతి   బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది.

తుఫాన్ సూచనతో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు,  కోతకు సిద్దంగా ఉన్న వరిపంటను వర్షాల ముందు కోయవద్దనిసూచించారు.  

Also Read :- తీరం దాటనున్న తీవ్ర అల్పపీడనం

వరి కోసిన తరువాత కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుతూ కుప్పలువేస్తే నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని వ్యవసాయాధికారులు తెలిపారు.  కోత కోసి పొలంలో ఉన్న పనలు వానకు తడిసినట్లు అయితే.. గింజ మొలెత్తకుండా ఉండటానికి ఉప్పు ద్రావణాన్ని పనలపై పడే విధంగా పిచికారీ చేయాలంది.  

పంటపొలాల్లో  నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు... చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.