బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్ : వారం రోజుల్లో మరో ముప్పు

బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల అంటే.. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుందని.. ఇది బలపడి తుఫాన్ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అలర్ట్ ఇచ్చింది విశాఖ వాతావరణ శాఖ. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు సెప్టెంబర్ 2వ తేదీ సమాచారం ఇచ్చింది. 

సెప్టెంబర్ 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి.. తుఫాన్ గా మారి.. ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒడిశా రాష్ట్రాల మధ్య తీరం తాటనుందని స్పష్టం చేసింది. ఈ తుఫాన్ కదలికలు, బలపడే తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది అనేది.. 48 గంటల్లో పూర్తి స్పష్టం వస్తుందని వివరించింది. 

Also Read:-మోకిలాలో నీట మునిగిన కోట్ల రూపాయల విల్లాలు

ఈ తుఫాన్ వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ఈ వర్షాలు ఏ స్థాయిలో ఉంటాయి.. ఏయే జిల్లాలకు ఎఫెక్ట్ ఉంటుంది అనేది రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.