మహబూబ్ నగర్ లో బ్యాటరీల దొంగ అరెస్ట్​

తలకొండపల్లి, వెలుగు: వాహనాల్లోని బ్యాటరీల చోరీకి పాల్పడుతున్న దొంగను తలకొండపల్లి పోలీసులు అరెస్ట్ ​చేశారు. ఎస్సై శ్రీకాంత్​ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం చుక్కాపూర్​లో గత నెలలో రైతుల ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లోని బ్యాటరీలను హైదరాబాద్​లోని ​ఫలక్​నుమాకు చెందిన సయ్యద్​ఇర్ఫాన్ ​హుస్సేన్, బండ్లగూడకు చెందిన అర్సాలం అహ్మద్​ అలియాస్​అబ్రార్, ఇబ్రహీం అహ్మద్​ కారులో వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించామన్నారు. నిందితుల్లో సయ్యద్ ఇర్ఫాన్ హుస్సేన్​ను అరెస్ట్​  చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు.