కానిస్టేబుల్ కుటుంబానికి అండగా బ్యాచ్ మేట్స్

సిద్దిపేట రూరల్, వెలుగు: ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి అతడి బ్యాచ్ మేట్స్​ అండగా నిలిచారు. దౌల్తాబాద్ పీఎస్​లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ, గజ్వేల్ లో రోడ్డు ప్రమాదానికి గురై  అకాల మరణం చెందిన పూసల వెంకటేశం కుటుంబ సభ్యులకు బుధవారం రూ.4 లక్షలను అతడి పిల్లలపై డిపాజిట్​చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

 కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.