లిక్విడ్ వేపరైజర్, మస్కిటో కాయిల్స్ కు బదులు కొన్నిరకాల మొక్కల్ని పెంచుకుంటే ఇంట్లోకి దోమలు రాకుండా జాగ్రత్తపడొచ్చు. మస్కిటో రిపెల్లింగ్స్ గా పనిచేసి కొన్ని మొక్కలు ఇవి...
లెమన్ గ్రాస్..
ఇంట్లో లెమన్ గ్రాస్ మొక్క ఉంటే దోమలు రావు. తలుపు దగ్గర ఈ మొక్కల కుండీకుండీ పెడితే దోచులు చూరంగా పోతాయి.
సిట్రోనెల్లా ఒడొమస్..
ఈ మొక్క వాసన నిమ్మజాతి మొక్కల ఆకుల వాసనని పోలి ఉంటుంది. సిట్రోనెల్లా ఒడొమస్ ని మస్మింటో రెపెల్లెంట్ క్రీమ్స్ తయారీలో వాడతారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే దోమలు రావు.
కాట్నిప్స్..
కాట్నిప్స్ మొక్క ఆకుల్లో నెపటలాక్టోస్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఇన్ సెక్ట్ రెపెల్లెంట్ గా పని చేస్తుంది. కాట్నిప్ ఆయిల్ రుద్దుకుంటే దోమలు కుట్టకుండా చూసుకోవచ్చు.
జెరనియోల్..
ఇది సహజ రసాయనం. తేమని పీల్చుకుని, ఇంటి పరిసరాల్లో దోమలు పెరగకుండా చేస్తుంది.
తులసి..
తులసి మొక్క హెర్బల్ టీగానే కాదు దోమల్ని తరిమేయడంలోనూ ఉపయోగపడుతుంది. పెరట్లో ఈ మొక్క ఉంటే, దీని ఘాటు వాసనకి దోమలు దరిదాపుల్లోకి కూడా రావు.
దాల్చిన చెక్క నూనె..
ఈ నూనె చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు. దోమలు పెరిగే చోట దాల్చిన చెక్క నూనె చల్లితే, దోమల లార్వాలు చనిపోతాయి. లెమన్ యూకలిప్టస్ ఆయిల్ ఈ నూనెని యూకలిప్టస్ సిట్రియోడోరా చెట్ల ఆకుల నుంచి తయారుచేస్తారు. ఇందులోని పారా-మెంఠనే-3,8-డయోల్ (పిఎండి) ఇన్ సెక్ట్ రెపెల్లెంట్ గా పనిచేస్తుంది. చర్మానికి ఈ నూనె రుద్దుకుంటే దోమలతో పాటు ఇతర క్రిములు కూడా కుట్టవు.
రోజ్ మేరీ..
రోజ్ మేరీ మొక్క ఆకుల్ని కొన్ని రకాల వంటల్లో వాడతారు. రోజ్ మేరీని ఇంట్లో లేదా ఇంటి బయట పెంచితే దోమల బెడద తప్పుతుంది.