బావోజీ జాతర పోస్టర్ రిలీజ్ చేసిన సీఎం

మద్దూరు, వెలుగు: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో నిర్వహించే బావోజీ జాతర వాల్  పోస్టర్ ను శనివారం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో గిరిజన సంఘం నాయకులతో కలిసి రిలీజ్​ చేశారు. ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. స్టేట్  ట్రైబల్  జేఏసీ చైర్మన్  రవి నాయక్, ఆల్  ఇండియా బంజారా సేవా సంఘ్  జిల్లా అధ్యక్షుడు అనిల్ నాయక్, ఆలయ ధర్మకర్త బావోజీ గోపాల్ నాయక్, రాథోడ్ నాయక్, బావోజీ కార్తీక్  పాల్గొన్నారు.