హైదరాబాద్, వెలుగు: డొమెస్టిక్ మనీ ట్రాన్స్ ఫర్, మినీ ఏటీఎం, క్యాష్ విత్ డ్రాయల్స్, ప్రిపెయిడ్ రీచార్జీలు, బిల్లు చెల్లింపులు, బీమా, వాలెట్ రీచార్జ్, ట్రావెల్ అండ్ స్టే బుకింగ్స్ సేవలు అందించే ఫిన్‌టెక్ స్టార్టప్ బ్యాంకిట్ తెలంగాణలో 2022 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు లక్షకు పైగా దుకాణాలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ప్రకటించింది. వీటిలో మెడికల్ షాపులు, రీచార్జ్ షాపులు, కిరాణాలు వంటివి ఉంటాయి. గత కొన్ని నెలలుగా కంపెనీ రాష్ట్రంలో బిజినెస్‌ను 50 శాతం పెంచుకుంది.
ఇది ఇప్పుడు 29 రాష్ట్రాల్లో ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 17,500 దాకా ఆపరేషనల్ అవుట్ లెట్స్ ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ఇది 50 శాతానికి పైగా గ్రామాలు, పట్టణాల్లో బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే 75 లక్షల కస్టమర్లకు సేవలను అందించామని బ్యాంకిట్ ప్రకటించింది.
