లింగంపేట, వెలుగు: అప్పు చెల్లించనందుకు భూమిని వేలం వేస్తామని పేర్కొంటూ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆఫీసర్లు గురువారం వ్యవసాయ పొలంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి అనే రైతు లింగంపేటలోని ఎన్డీసీసీ బ్యాంక్‌లో గతంలో అప్పు తీసుకుని సకాలంలో చెల్లించలేదు.
సదరు రైతు రూ.7,86,909లను చెల్లించాల్సి ఉండగా బ్యాంక్ ఆఫీసర్లు ఈ నెల20 న భూమిని వేలం వేస్తామని పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎన్‌డీసీసీబ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భూపాల్‌రెడ్డి, స్థానిక బ్యాక్ మేనేజర్ కుమారస్వామి,శెట్పల్లి సంగారెడ్డి విండో సీఈఓ శ్రీనివాస్,సిబ్బంది ఉన్నారు.