బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ మహారాష్ట్రలో ఆఫీసర్​ జాబ్స్​

మహారాష్ట్ర, పుణెలోని బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ మహారాష్ట్ర వివిధ విభాగాల్లోని 195 ఆఫీసర్ (స్కేల్: 2, 3, 4, 5, 6) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

విభాగాలు: మొత్తం 195 పోస్టుల్లో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ రిస్క్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, ఫారెక్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ట్రెజరీ, ఐటీ/ డిజిటల్‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌/ సీఐఎస్‌‌‌‌‌‌‌‌ఓ/ సీడీఓ, క్రెడిట్‌‌‌‌‌‌‌‌, ఎకనామిస్ట్‌‌‌‌‌‌‌‌ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 

పోస్టులు: డిప్యూటీ జనరల్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ జనరల్ మేనేజర్‌‌‌‌‌‌‌‌, చీఫ్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌, సీనియర్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌, మేనేజర్‌‌‌‌‌‌‌‌,  అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ జనరల్ మేనేజర్‌‌‌‌‌‌‌‌, చీఫ్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌, బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెవెలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు స్కేల్-2 పోస్టులకు రూ.64,820- నుంచి రూ.93,960, స్కేల్-3కు రూ.85,920  నుంచి - రూ.1,05,280, స్కేల్-4కు రూ.1,02,300 నుంచి -రూ.1,20,940, స్కేల్-5కు రూ.1,20,940- నుంచి రూ.1,35,020, స్కేల్-6 పోస్టులకు రూ.1,40,500- నుంచి రూ.1,56,500 చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్‌‌‌‌‌‌‌‌ డిస్కషన్‌‌‌‌‌‌‌‌ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: అభ్యర్థులు ఆఫ్​లైన్​లో జనరల్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌, బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ మహారాష్ట్ర, హెచ్‌‌‌‌‌‌‌‌.ఆర్‌‌‌‌‌‌‌‌.ఎం డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, హెడ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌, లోక్‌‌‌‌‌‌‌‌మంగల్‌‌‌‌‌‌‌‌, శివాజీనగర్‌‌‌‌‌‌‌‌, పుణె అడ్రస్​కు జులై 26 వరకు పోస్టులో పంపించాలి. ఎస్సీ/ ఎస్టీ  అభ్యర్థులకు రూ.118. ఇతరులకు రూ.1180 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. వివరాలకు  www.bankofmaharashtra.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.