బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 ఉద్యోగాలు.. పరీక్ష లేదు, మెరిట్ ఆధారంగాఎంపిక

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శుభవార్త చెప్పింది. 600 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 24వ తేదీలోపు ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ మరో మంచి విషయమేమిటంటే, ఈ ఉద్యోగాల భర్తీకి ఎటువంటి పరీక్ష నిర్వహించడం లేదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నారు. కావున, 10+2/ డిప్లొమాలో మంచి మార్కులు సాధించిన వారికి ఇదొక సువర్ణావకాశమని చెప్పుకోవాలి. 

మొత్తం ఖాళీలు: 600 (అప్రెంటిస్)

తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు: ఏపీ- 11, తెలంగాణ- 16

విద్యార్హతలు: అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదేని విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 30/ 06/ 2024 నాటికి అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ.150+GST, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.100+GST అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

స్టైపెండ్: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ఏడాది పాటు నెలకు రూ.9000 స్టైపెండ్ అందిస్తారు.

ఎంపిక విధానం: అభ్యర్థులు దరఖాస్తు చేయు సమయంలో 12వ తరగతి/ 10+2/ డిప్లొమాలో సాధించిన మార్కుల శాతం వివరాలను  ఆన్‌లైన్‌ లో నమోదు చేయాలి. ఈ మార్కులు/ శాతం ఆధారంగా మెరిట్ జాబితాను రాష్ట్రాల వారీగా తయారు చేస్తారు. ఎక్కువ మంది పోటీలో ఉంటే, వయసును ప్రామాణికంగా తీసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ ను క్షుణ్ణంగా చదవండి.

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్ 14
  • దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 24

నోటిఫికేషన్ కోసం Bank of Maharashtra Apprentice Recruitment 2024 ఇక్కడ క్లిక్ చేయండి.