నచ్చిన భాషలో అకౌంట్​ వివరాలు

నచ్చిన భాషలో అకౌంట్​ వివరాలు

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్ల కోసం నచ్చిన భాషలో అకౌంట్ ​వివరాలు తెలుసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది.  ఇందుకు సంబంధించి 3 రోజుల బ్యాంక్​ బ్రాంచ్​ల్లో లాగిన్ డే  నిర్వహిస్తోంది. కస్టమర్లు తమకు నచ్చిన భాషలో ఎస్ఎమ్ఎస్ ని పొందొచ్చు. బ్యాంక్ లో నమోదైన తమ మొబైల్ నంబర్​ నుంచి 8422009988 నంబర్​కు THIN (హిందీ) భాష కోసం LANG<spaces>HIN అని, ఇతర భాషలైన TEL (తెలుగు), TAM (తమిళం), KAN (కన్నడ), ASM (అస్సామి), BEN (బంగ్లాజ్), GUJ (గుజరాతి), MAL (మలయాళం), MAR (మరాఠీ), ORI (ఒరియా), PAN (పంజాబీ), URD (ఉర్దూ) కోసం అని ఎస్ఎమ్ఎస్  పంపాలి. వివిధ మాధ్యమాల ద్వారా ఫెసిలిటీని బ్యాంక్ ​అందుబాటులోకి తేనుండగా దేశవ్యాప్తంగా ఈనెల 18,19, 21వ తేదీల్లో ఎస్ఎమ్ఎస్ లాగిన్ డే కొనసాగిస్తున్నట్లు బ్యాంక్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.