మార్చి నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు

మార్చి నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు

మార్చి నెలలో బ్యాంకులకు ఆరు రోజులు సాధారణ సెలవులతోపాటు మరో ఐదు రోజులు అదనంగా సెలవులు వస్తున్నాయి. వీటితోపాటు మరో రెండు రోజులపాటు బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగే అవకాశముంది. వివరాలిలా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు ఇండియా క్యాలెండర్ ప్రకారం.. మార్చి 11, 22, 29, 30 తారీఖులతో పాటు ఆదివారాలు, రెండో శనివారాలు బ్యాంకులు మూసే ఉంటాయి. అయితే..ఈ సెలవులను అన్ని రాష్ట్రాలూ పాటించని కారణంగా రాష్ట్రాల వారీగా సెలవుల సంఖ్య మారనుంది. గెజిట్ సెలవులను మాత్రమే దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు పాటిస్తాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తమై ముందుస్తుగా తగు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది.

మరోవైపు బ్యాంకు ఉద్యోగ యూనియన్లు మార్చి నెల మధ్యలో సమ్మెకు దిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం పలు బ్యాంకులను ప్రయివేటీకరించడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో యూనియన్లు… సమ్మె ద్వారా నిరసన చేపట్టాలని భావిస్తున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకు యూనియన్లు సమ్మె చేపట్టబోతున్నారు.

మార్చి 2021లో బ్యాంకు సెలవులు:

  • 5 మార్చి 2021: చాప్చర్ కుట్ (మిజోరం)
  • 7 మార్చి 2021: ఆదివారం
  • 11 మార్చి 2021: మహాశివరాత్రి
  • 13 మార్చి 2021: రెండవ శనివారం
  • 14 మార్చి 2021: ఆదివారం
  • 21 మార్చి 2021: ఆదివారం
  • 22 మార్చి 2021: బీహార్ డే
  • 27 మార్చి 2021: నాల్గవ శనివారం
  • 28 మార్చి 2021: ఆదివారం
  • 29 మార్చి 2021: ధూలేటి/యోసాంగ్ రెండవ రోజు
  • 30 మార్చ్ 2021: హోలీ