రూ.1.49 కోట్లు కాజేసిన బ్యాంక్​ ఎంప్లాయ్​ అరెస్ట్

అచ్చంపేట, వెలుగు : నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచ్​లో  సీనియర్  అసిస్టెంట్ గా పని చేస్తూ ఖాతాదారుల అకౌంట్లలో నుంచి డబ్బులు కాజేసిన భూమిరెడ్డి కిరణ్​కుమార్​ను రిమాండ్ కు పంపినట్లు సీఐ రవీందర్  తెలిపారు. ఏపీలోని కడప జిల్లాకు చెందిన కిరణ్ కుమార్  అచ్చంపేట ఎస్బీఐ బ్రాంచిలో 2018 నుంచి 2023 వరకు పని చేశాడు. 

ఆ సమయంలో ఖాతాదారుల సేవింగ్  అకౌంట్స్ లో నుంచి వారికి తెలియకుండా రూ. 1.49 కోట్లకు పైగా విత్ డ్రా చేశాడు. తన భార్య సోమాల ప్రశాంతితో పాటు అదే బ్యాంకులో ఉన్న వివిధ అకౌంట్లకు బదిలీ చేసి సొంతానికి వాడుకున్నాడు. బ్రాంచ్  మేనేజర్  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కిరణ్ కుమార్‌‌‌‌ను అరెస్ట్​ చేసి రిమాండ్‌‌కు పంపినట్లు సీఐ తెలిపారు.