ఢాకా: ప్రధాని నరేంద్ర మోడీకి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తమ దేశం నుంచి మామిడి పండ్లను గిఫ్ట్‌గా పంపారు. మోడీతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలిపి 2600 కిలోల బంగ్లా మామిడి పండ్లను పార్శిల్ చేశారు. బంగ్లాదేశ్‌లో బాగా ఫేమస్ అయిన ‘హరిబంగా’ రకం మామిడి పండ్లను 260 బాక్సుల్లో ప్యాక్ చేయించి పంపారు. బంగ్లాదేశ్‌లోని రంగాపూర్ జిల్లాలో పండే ఈ స్పెషల్ మ్యాంగోస్‌తో బయలుదేరిన ట్రక్కులు ఆదివారం మధ్యాహ్నం బెనాపోల్ చెక్‌పోస్ట్ దగ్గర బోర్డర్ దాటి మన దేశంలోకి వచ్చాయి. రెండు దేశాల మధ్య స్నేహ బంధానికి గుర్తుగా ప్రధాని షేక్ హసీనా ఈ మామిడి పండ్లను పంపారని బెనాపోల్ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ అనుపమ చక్మా అన్నారు. కోల్‌కతా చేరుకున్న ఈ మామిడి పండ్లను అక్కడి బంగ్లా డిప్యూటీ హైకమిషనర్ మహమ్మద్ శామ్యూల్ ఖ్వాదర్ రిసీవ్ చేసుకున్నారు. వాటిని ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు బంగ్లాదేశ్ ప్రధాని హసీనా తరఫున అందజేస్తారని తెలుస్తోంది.
