IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో టీ20.. టాస్ ఓడిన టీమిండియా

గ్వాలియర్‌లో తొలి టీ20 నెగ్గి ఊపుమీదున్న టీమిండియా.. బుధవారం మరో పోరుకు సిద్ధమైంది.  ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు రెండో టీ20  జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో మొదట బౌలింగ్  ఎంచుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి మంచు కురిసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లా సారథి తెలిపాడు.

తుది జట్లు:

భారత్‌: అభిషేక్‌శర్మ, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), నితీశ్‌రెడ్డి, హార్దిక్‌ పాండ్యా, రియాన్‌ పరాగ్‌, రింకూ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌ సింగ్‌, మయాంక్‌ యాదవ్.

బంగ్లాదేశ్‌: పర్వేజ్‌ హోసేన్‌, లిటన్‌ దాస్‌(వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్‌ హృదయ్‌, మహ్మదుల్లా, జాకీర్‌ అలీ, మెహిది హసన్‌ మిరాజ్‌, రిషద్‌ హోసేన్‌, తస్కిన్‌ అహ్మద్‌, తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్.

ALSO READ | Ranji Trophy 2024-25: గాయంపై ఆందోళనలు.. రంజీ ట్రోఫీలో షమీకి దక్కని చోటు