ఫేక్ పాస్ పోర్ట్ వ్యవహారంలో నటి అరెస్ట్...

కొంతమంది తమ దేశంలో అవకాశాలు లేక అక్రమంగా భరత్ లోకి చొరబడి అడ్డదారుల్లో డబ్బు సంపాదించాడని ప్రయత్నిస్తూ కటకటాల పాలవుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ కి చెందిన యువతి నకిలీ పాస్ పోర్ట్ పై భారత్ కి వచ్చి పోలీసులకి చిక్కిన ఘటన ముంబై నగరంలో వెలుగు చూసింది. 

పూర్తీ వివరాల్లోకి  ఆరోహి బర్దే అనే యువతి ముంబైకి నగరానికి దగ్గరలోని ఉల్హాస్‌నగర్‌లో తన కుటుంబ సభ్యులతో కలసి ఉంటోంది. అయితే ఆరోహి బర్దే పలు అడల్ట్ చిత్రాల్లో నటించేది. దీంతో చుట్టుప్రక్కల వారికి అనుమానం కలగడంతో పోలీసులకి సమాచారం అందించారు. 

ALSO READ | IND vs BAN 2024: అంతా అబద్ధం: బంగ్లా వీరాభిమానిపై దాడి జరగలేదట

సమాచారం అందుకున్న పోలీసులు ఆరోహి బర్దే ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. ఈ క్రమంలో ఆరోహి బర్దే అసలు పేరు రియా బర్దే అని అలాగే బాంగ్లాదేశ్ కి చెందినదని పోలీసులు కనుగున్నారు. అంతగాకుండా ఆరోహి బర్దేతోపాటూ మరో నలుగురిపై ఫారినర్స్ యాక్ట్, 1946 సెక్షన్ 14(A)తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ కింద హిల్‌లైన్ పోలీసులు కేసు నమోదు చేశారు.