డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై బెంగుళూరు కోర్టు ఆయను సమన్లు జారీ చేసింది. గతేడాది సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో బెంగుళూరు నివాసి చేసిన ఫిర్యాదుతో బెంగుళూరు కోర్టు తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు సమన్లు జారీ చేసింది.
సెప్టెంబర్ 2023 లో జరిగిన ఓ కార్యక్రమంలో డీఎంకే నేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. ఈ వ్యాధుల మాదిరిగానే సనాతన ధర్మాన్ని దేశం నుంచి తరిమికొట్టాలని అన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు తప్పుపట్టాయి. ప్రధాని మోదీ కూడా ఖండించారు.
సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమైన సనాతన వ్యవస్థను నిర్మూలించాలని మాత్రమే తానుపిలుపునిచ్చానని తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
అప్పటి నుంచి ఉదయనిధిపై అనేక కేసులు నమోదయ్యాయి. విభజన ఆలోచనలు ప్రోత్సహించేలేదా ఏదైనా భావజాలాన్ని రద్దు చేసే హక్కు ఏ వ్యక్తి కి లేదని మద్రాస్ హైకోర్టు ఉదయనిధి స్టాలిన్ మందలించింది. సనాతన ధర్మంపై ఉదయనిధి మాట్లాడిన కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తికి కూడా బెంగళూరు కోర్టు సమన్లు జారీ చేసింది.
