స్వామివారిని టచ్ చేశారు.. ఘోరంగా ఓడిపోయారు.. వైసీపీపై బండి సంజయ్ ఫైర్..

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమలలో పర్యటించారు. తన పుట్టినరోజు సందర్బంగా శ్రీవారిని దర్శించుకున్నారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బండి. తిరుమలలో శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు దిగిపోయారని అన్నారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను పూర్తిగా కొల్లగొట్టారని మండిపడ్డారు.

స్వామివారిని టచ్ చేశారు కాబట్టే ఘోరంగా ఓడిపోయారని అన్నారు. దేవుడి ఆస్తులను దోచుకొని తింటే ఎవ్వరికైనా ఇలాంటి గతే పడుతుందని అన్నారు.జగన్ హయాంలో టీటీడీ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిందని ఫైర్ అయ్యారు బండి. ఎర్రచదనం దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. నయవంచకులు పోయి, స్వామి వారికి నిత్యం సేవ చేసే సేవకులు వచ్చారని అన్నారు బండి సంజయ్.

Also Read:తల్లికి 15 వేల రూపాయలపై మార్గదర్శకాలు విడుదల