గోపాల్​పేటలో బండలాగుడు పోటీలు

వనపర్తి, వెలుగు: గోపాల్ పేట మండల కేంద్రంలోని శ్రీకోదండరామస్వామి ఉత్సవాల సందర్భంగా శనివారం రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా గ్రామాల్లో నిర్వహించే బండలాగుడు పోటీలతో గ్రామీణ ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంటుందని, బండలాగుడు పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు.  అనంతరం శ్రీకోదండ రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సత్య శీలా రెడ్డి, శివన్న, నాగశేషు,  బాలపీరు, బాలయ్య,  కోదండం, వెంకటయ్య, బుచ్చన్న, చరణ్ పాల్గొన్నారు.