హైదరాబాద్, వెలుగు: మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్‘సి’ తన 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన లక్కీ డ్రా ఆఫర్‌కు అద్భుత స్పందన వచ్చిందని సంస్థ ఫౌండర్ ఎం..బాలుచౌదరి చెప్పారు. ఆఫర్లో భాగంగా మూడు లక్కీడ్రాలు ఉంటాయి. విజేతలకు 20 మారుతి సుజుకీ ఆల్టో కార్లు, 20 బజాజ్ ప్లాటినా బైక్స్, 20 ఫ్రిజ్‌లు, 20 ఏసీలు, 20 టీవీలను బహుమతులుగా ఇస్తారు. ఆఫర్ వచ్చే నెల 29 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం మొదటి డ్రా విజేతల పేర్లను ప్రకటించారు. ఆరుగురికి కార్లు, ఆరుగురికి బైక్స్,ఆరుగురికి ఫ్రిజ్‌లు, ఆరుగురికి ఏసీలు, ఆరుగురికి టీవీలు ఇస్తారు. ప్రతి మొబైల్, టీవీ, ల్యాప్టాప్కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుంది. రూ.మూడు వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. కిస్తీల్లో పద్ధతిలో వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండానే మొబైల్ కొనుక్కోవచ్చు. ఈ సందర్భంగా బాలు చౌదరి మాట్లాడుతూ మొబైల్రిటైల్రంగంలోనే మొదటిసారిగా యాక్ససరీస్‌పై కూడా కచ్చితమైన బహుమతి ఇస్తున్నామని చెప్పారు. బ్రాండును బట్టి ఫోన్లపై రూ.మూడు వేల నుంచి రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నామని వెల్లడించారు. గోపాల కృష్ణ అనే కస్టమర్‌తోపాటు మరో ఐదుగురు కార్లను గెలుచుకున్నారని చెప్పారు.
