త్వరలోనే జనసేనలో చేరుతున్నా.. బాలినేని

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే జనసేన పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఇవాళ ( సెప్టెంబర్ 19, 2024 ) జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేనలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్  తనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారని, ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని అన్నారు. ఈ క్రమంలో జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు బాలినేని. జగన్ తన త్యాగాన్ని గుర్తించలేదని అన్నారు. త్యాగాలు చేసిన 17మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరికి కూడా న్యాయం జరగలేదని అన్నారు.

మంత్రి పదవి వదులుకొని జగన్ కోసం వచ్చానని, ప్రజాసమస్యల పరిష్కారం కోసమే జగన్ తో కలిసి నడిచానని అన్నారు. వైసీపీలో ఎన్నో అవమానాలు భరించానని అన్నారు. జగన్ నుండి డబ్బులు ఆశించానన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆస్తులు పోగొట్టుకున్నా తప్ప, జగన్ ను ఏనాడు డబ్బులు డిమాండ్ చేయలేదని స్పష్టం చేసారు.