దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపిన ఓడిశా రైలుప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. బాలాసోర్ జిల్లాలో జరిగిన ఈ రైలు ప్రమాదంలో 297 మంది మృతి చెందారు. అయితే 28 మృతదేహాలను గుర్తించక పోవడంతో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించనున్నారు. 28 మృతదేహాలకు అక్టోబర్ 10న అంత్యక్రియలు చేయనున్నారు. దహన సంస్కారాల ప్రక్రియను మొత్తం వీడియో తీయనున్నారు.
2023 జూన్ లో ప్రమాదం జరిగినప్పటి నుంచి భువనేశ్వరీలోని ఎయిమ్స్ లో 162 మృతదేహాలు ఉంచారు. వాటిలో 81 మృతదేహాలను మొదటి దశలో మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించారు. తరువాత DNA పరీక్షల తరువాత మరో 53 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు, అయితే 28 మంది మృతదేహాలు గుర్తించలేదని అధికారి తెలిపారు.
ఈ 28 మృతదేహాలు వలస వచ్చిన కార్మికులవా? లేక అనాథలవా? అని అధికారులు భావిస్తున్నారుం. ఎందుకంటే మృతదేహాల కోసం నాలుగు నెలలుగా ఒక్కరు రాలేదంటే అనాథలైన ఉటారని భావిస్తున్నారు. అనాథ శవాలకు 30 రోజులు దాటితే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా.. ఈ కేసును సీబీఐ విచారిస్తుండటంతో ఆలస్యం అయింది.
