Ganja seize: కార్గో కారులో రూ.85లక్షల గంజాయి.. తరలిస్తున్న నలుగురు అరెస్ట్

రంగారెడ్డి: హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. ఇతర రాష్ట్రాలనుంచి హైదరాబాద్ నగరానికి వివిధ మార్గాల్లో అక్రమం గా గంజాయి తరలించి విక్రయిస్తున్నారు నిందితులు.. ఇటీవల కాలంలో గంజాయి పట్టుబడిన రోజంటూ లేదు.. హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి జిల్లాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి పట్టుబడుతోంది.తాజాగా కుత్బుల్లాపూర్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న కార్గో వాహనాన్ని పట్టుకున్నారు.

ALSO READ | ప్యాకర్స్ అండ్ మూవర్స్ ముసుగులో భారీగా గంజాయి రవాణా...

శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై కార్గో(బొలెరె) వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 243 కేజీల గంజాయిని బాలా నగర్ ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ 85 లక్షలుంటుందని పోలీసులు అంచనా వేశారు. ఒడిషా నుంచి మహారాష్ట్రకు తెలంగాణ మీదుగా తరలిస్తున్నారు.అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయితోపాటు , 7 మొబైల్ ఫోన్లు, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి చెప్పారు.