జనంలోకి బాలయ్య... స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సు యాత్ర..

ఏపీలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. పోలింగ్ తేదికి రోజులు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్, ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, వారాహి విజయభేరి పేరుతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనంలోకి వెళ్తుండగా నందమూరి బాలకృష్ణ కూడా జనంలోకి వెళ్లేందుకు సిద్దమయ్యాడు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు బాలయ్య. ఏప్రిల్ 12న కదిరి నుండి ఈ యాత్ర ప్రారంభం కానుంది.

ఈ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రమంతా కవర్ చేయనున్నాడు బాలకృష్ణ. ఏప్రిల్ 14న శింగనమల, అనంతపురంలో యాత్ర సాగనుంది. గత ఎన్నికల్లో రెండుసార్లు హిందూపూర్ నుండి పోటీ చేసి గెలిచిన బాలకృష్ణ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు. వైసీపీ తరఫున దీపిక బాలయ్యపై పోటీ చేస్తున్నారు. మరి, ఈ ఎన్నికల్లో కూడా హిందుపూర్లో ఎప్పటిలాగే టీడీపీ జెండా ఎగురుతుందా లేక వైసీపీ విజయం సాధిస్తుందా అన్నది వేచి చూడాలి.