సీఎం రేవంత్ రెడ్డితో బాలయ్య చిన్న కుమార్తె భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఏపీలోని హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ చిన్న కుమార్తె. 2024, సెప్టెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం.. బాలయ్య కుమార్తె తేజస్విని.. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. 

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చాయి. బాధితులకు అండగా 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు బాలకృష్ణ. ఈ మేరకు ఆ వరద సాయం చెక్కును.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి స్వయంగా అందించారు తేజస్విని. నాన్న తరపున ఈ సాయం అందించినట్లు స్పష్టం చేశారు తేజస్విని.  

ALSO READ | గ్రేటర్ లో నాలాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా .. సర్వే షురూ

తెలంగాణతో పాటు ఏపీకి కూడా 50 లక్షల సాయం ప్రకటించారు బాలయ్య. ఈ చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు.. స్వయంగా అందించారు. మంత్రి పొంగులేని శ్రీనివాసులరెడ్డి, మరో సీనియర్ నేత జితేందర్ రెడ్డి సైతం ఈ సమావేశంలో ఉన్నారు.