బాలయ్య డైలాగ్ వైరల్: ఎవడి కిరీటమో నేను మోయనురా.. నా కిరీటాన్ని నేనే సగౌరవంగా ఎలుతా

బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి రూపొందిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. 

ఈ సందర్బంగా బాలకృష్ణ హోస్ట్గా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్‌ షోలో ఆసక్తికరమైన డైలాగ్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. "ఏంట్రా వాగుడు.. ఏం కూసారు.. ఏం చూసుకుని వాళ్లకంత పొగరంటారా?.. నన్ను చూసుకునే!.. పదునైన పొగరంట ఎవరినీ చూసి ధైర్యం అంటారా?అన్నీ తెలుసా వీడికంటారా? నన్ను తెలుసుకోవడం కంటే గొప్ప విద్య ఏముందిరా? సవాలై నిలబడతా.. నా మాట సూటిగా ఉంటుంది.. నా వాటా ముక్కుసూటిగా నడుస్తది.. నా వీక్షణం దీక్షను దక్షిణం చేస్తది.. నా తీరు గాన గాంభీర్యంగా వెలుగుతూ ఉంటుంది.. ఆత్మాభిమానమే నా చిరునవ్వు అయినప్పుడు.. ఆత్మ విశ్వాసమే నిలువెత్తు రూపమై కనిపిస్తుంది.

మోసం నాకు తెలియని విషయం.. కల్మషం నేను నేర్వని నైజాం. స్వార్ధం నేను మోయని భారం. ఎవడి కిరీటమో నేను మోయనరా, నా కిరీటాన్ని నేనే అలంకరించుకొని సగౌరవంగా అలంకరించుకుని నేనే ఏలుకునే మహారాజ్ నవుతా.. డాకు.. డాకు మహారాజ్ " అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అద్దిరిపోయింది. ఇది నిజ జీవిత రాజకీయాలకు దగ్గరగా ఉండటంతో ఎవరినైనా అన్నారా అనే సందేహం ఇప్పుడు నెటిజన్స్ లో మొదలైంది. ఇదొక డైరెక్ట్ పంచ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. 

అయితే.. ఈ పవర్ ఫుల్ డైలాగ్ డాకు మహారాజ్ సినిమాలో భాగంగా వచ్చేది అనేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో బాలకృష్ణ నటించిన పాత్ర రియల్ కింగ్ 'డాకు మాన్​ సింగ్'ది. అతను పోలీసులకు నేరస్తుడు.. కొన్ని ఊళ్లకు దేవుడు. ఎంతోమందికి మేలు చేసిన గొప్ప నాయకుడు. ఈ సినిమాని మాన్ ​సింగ్ స్టోరీ ఇన్​స్పిరేషన్​తోనే తీశారట డైరెక్టర్ బాబీ! లెక్కలేనన్ని దోపిడీలు చేసిన అతన్ని దేవుడిలా ఎందుకు కొలుస్తున్నారు? అతను ఎక్కడివాడు? అనేది జనవరి 12న సినిమాలో చూడబోతున్నాం.