DaakuMaharaaj: డల్లాస్లో డాకు మహారాజ్.. ప్రీ రిలీజ్ వేదికను హోరెత్తించనున్న బాలయ్య ఫ్యాన్స్

బాబీ డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(DaakuMaharaaj). మాస్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతికి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా వరుస సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు.

ఈ నేపథ్యంలో నేడు (జనవరి 4న) డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ డల్లాస్ లో జరగనుంది. ఇప్పటికే బాలయ్య డల్లాస్ చేరుకోగా.. ఎయిర్ పోర్టులో ఫాన్స్ ఘన స్వాగతం పలికారు.

ఇవాళ సాయంత్రం అభిమానుల మధ్యకు రానున్న బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏం మాట్లాడుకున్నాడో ఆసక్తిగా మారింది. బాలయ్య ఏం మాట్లాడిన నైజాం, ఆ రాజసం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో అభిమానులు డల్లాస్ వేదికను హోరెత్తించడం ఖాయమనే అర్ధమవుతోంది. ఇకపోతే గేమ్ ఛేంజర్ తర్వాత డల్లాస్ లో జరుగుతున్నా తెలుగు సినిమా ఈవెంట్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం బాలయ్య డల్లాస్ లో దిగిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో బాలయ్యకి జోడిగా ప్రగ్య జైస్వాల్,  ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే డాకు మహారాజ్ కి పోటీగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి. ఈ మూడు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ లో వస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.