అనాథ వృద్ధులకు దసరా కానుక

  • బగిలీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ 

నర్సాపూర్, వెలుగు : వృద్ధాశ్రమంలో  ఆశ్రయం పొందుతూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వృద్ధులకు బగిలీస్ ఫౌండేషన్ దసరా కానుకలను అందజేసింది.   మంగళవారం నర్సాపూర్ లోని విజన్ వృద్ధాశ్రమంలో ఉన్న 50 మంది వృద్ధులకు రానున్న దసరా పండుగను పురస్కరించుకుని కొత్త బట్టలను అందజేసింది.  బగీలీస్ ఫౌండేషన్ ఫౌండర్ నర్సింగ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  

కొత్త బట్టలు అందుకున్న వృద్ధులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా నర్సింగ్ సాగర్ మాట్లాడుతూ..  సమాజ హితం సేవే అభిమతంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో ఫౌండేషన్ అడ్వైజర్ కవిత, సభ్యులు స్వాతి, లక్ష్మణ్, లింగన్న, పారాలీగల్ వాలంటీర్ లలిత, ఆశ్రమ నిర్వహకురాలు అపర్ణ పాల్గొన్నారు.