జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్ మంజూరు

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్ మంజూరు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు అనంతపురం కోర్టు బుధవారం  బెయిల్ మంజూరు చేసింది. వారిపై నమోదైన మూడు కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. తాడిపత్రిని వదిలి ఎక్కడకూ వెళ్లకూడదని షరతు పెట్టింది. వాహనాల రిజిస్ట్రేషన్ స్కాంలో జూన్ 13న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో వీరిద్దరూ ఉన్నారు. బెయిల్ పేపర్లు సెంట్రల్ జైలుకు చేరితే, రేపు వీరు విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ వీరిద్దరూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఇటీవలే కొట్టేసింది.