విద్యార్థులకు బ్యాగులు అందజేత

ఉప్పునుంతల, వెలుగు: ఉప్పునుంతల గ్రామానికి చెందిన మర్యాద రుక్మారెడ్డి మండల కేంద్రంలోని బాలుర, బాలికల పాఠశాలల్లో చదువుతున్న స్టూడెంట్లకు స్టడీ బ్యాగులు పంపిణీ చేశారు. బాయ్స్​ స్కూల్​లో చదువుకున్న రుక్మారెడ్డి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. తన సోదరుడు కృష్ణారెడ్డితో స్కూల్​ బ్యాగులు పంపిణీ చేశారు. హెచ్ఎంలు శ్రీనివాస్ రెడ్డి, కట్ట నరసింహారెడ్డి, లక్ష్మీనారాయణ, టీచర్లు బాలామణి, వెంకటేశ్, వెంకటలక్ష్మి, రామచంద్రారెడ్డి, శేఖర్ ముదిరాజ్  తదితరులు పాల్గొన్నారు.