Delhi Premier League 2024: 19 సిక్సర్లతో సునామీ.. గేల్ ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ చేసిన భారత క్రికెటర్

ఆయుష్ బదోనీ క్రికెట్ లవర్స్ కు ఈ పేరు సుపరిచితమే. ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ తరపున కూని కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. సన్నగా ఉంటాడు.. సింగిల్స్ తీస్తాడు అనే పేరుంది. నిలకడగా ఆడినా వేగంగా ఆడలేడనే విమర్శ ఉంది. అయితే ఇప్పుడు అదే బ్యాటర్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఏకంగా 19 సిక్సర్లతో టీ20 క్రికెట్ లో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. 

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శుక్రవారం (ఆగస్టు 30) రాత్రి సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్, నార్త్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లీగ్ లో సూపర్‌స్టార్జ్ తరపున ఆడుతున్న బదోనీ విధ్వంసం ఓ రేంజ్ లో సాగింది. కొడితే బౌండరీ పక్కా అన్నట్టుగా అతని విధ్వంసం సాగింది. 55 బంతుల్లోనే 165 పరుగులు చేసాడంటే అతని విధ్వంసం ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు.. 19 సిక్సర్లున్నాయి. ఈ ఇన్నింగ్స్ తో టీ20 క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా బదోని రికార్డ్ సృష్టించాడు. 

ALSO READ | Delhi Premier League 2024: భారత క్రికెటర్ తడాఖా.. 6 బంతుల్లో 6 సిక్సర్లు

టీ20 గేల్ ఇప్పటివరకు 18 సిక్సర్లు కొట్టగా.. 19 సిక్సర్లతో బదోని ఈ రికార్డ్ బ్రేక్ చేసాడు. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా మరో రికార్డ్ తన  ఖాతాలో వేసుకున్నాడు. ఫిబ్రవరి 2019లో సిక్కింపై శ్రేయాస్ అయ్యర్ 55 బంతుల్లో 147 పరుగుల రికార్డ్ నేటితో బ్రేక్ అయింది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఈ సీజన్ లో బదోని ఏడు ఇన్నింగ్స్‌లలో 212.21 స్ట్రైక్ రేట్‌తో 452 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉంది.